AP: జాక్‌పాట్‌ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప | 600 Kgs Fish Caught In Fishermen Net At Anakapalle District | Sakshi
Sakshi News home page

జాక్‌పాట్‌ తగిలింది.. వలకు చిక్కిన 600 కిలోల చేప.. ధర ఎంతో తెలుసా? 

Feb 28 2023 7:32 AM | Updated on Feb 28 2023 9:49 AM

600 Kgs Fish Caught In Fishermen Net At Anakapalle District - Sakshi

ఎస్‌.రాయవరం (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం బంగారమ్మపాలెం తీరంలో సోమవారం మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ముక్కుడు టేకుగా పిలిచే ఈ చేప సుమారు 600 కిలోల బరువు ఉంది. దీని విలువ సుమారు రూ.2 లక్షలపైనే. సముద్రంలో వలకు చిక్కిన ఈ చేపను మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు లాక్కొచ్చారు.

 

అంత ఖరీదైన చేపను స్థానికంగా కొనే నాథుడు లేక కాకినాడ, విశాఖపట్నంలోని చేపల వ్యాపారులకు సమాచారం ఇచ్చారు. ఈ రేవులో ఇంత పెద్ద చేప మొదటిసారిగా దొరికిందని, అనుకున్న ధర రాకపోతే చేపను సముద్రంలో విడిచిపెడతామని మత్స్యకారులు చెప్పారు. ప్రస్తుతం శారద, వరాహ నదుల కలయిక మొగలో నీటిలో వల తాడుతో  బంధించి ఉంచారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement