రాష్ట్రానికి 6 లక్షల డోసుల టీకా | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి 6 లక్షల డోసుల టీకా

Published Sun, Apr 18 2021 3:41 AM

6 lakh doses of Covid vaccine for AP - Sakshi

సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి శనివారం 6 లక్షల డోసుల కోవిడ్‌ టీకా వచ్చింది. తొలుత పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 5 లక్షల కోవిషీల్డ్‌ టీకా డోసులను విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్‌ కండీషన్‌ కంటైనర్‌ ద్వారా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తీసుకువచ్చి నిల్వ చేశారు.

హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ నుంచి లక్ష కోవాగ్జిన్‌ టీకా డోసులను రోడ్డు మార్గం ద్వారా టీకాల భవనానికి తరలించారు. అనంతరం మొత్తం 6 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రంలోని 13 జిల్లాలకు తరలించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాకు 56,300 డోసుల కోవిషీల్డ్‌ టీకాను పంపిణీ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి తగినంత వ్యాక్సిన్‌ను పంపించాలని సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని, వ్యాక్సిన్‌ ప్రక్రియ ఏపీలో అత్యంత వేగంగా జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement