రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డుల ప్రదానం | 3 awards for Andhra Pradesh in Program Officer Volunteer category | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డుల ప్రదానం

Sep 25 2022 6:01 AM | Updated on Sep 25 2022 6:01 AM

3 awards for Andhra Pradesh in Program Officer Volunteer category - Sakshi

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పార్థసారథి

సాక్షి, న్యూఢిల్లీ/వెంకటాచలం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా): జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌–2020–21) అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు మూడు, తెలంగాణకు రెండు అవార్డులు లభించాయి. ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ కేటగిరీలో జేఎన్‌టీయూ అనంతపురానికి చెందిన జితేంద్రగౌడ్, వలంటీర్‌ కేటగిరీలో నెల్లూరులోని కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన దేవనపల్లి సిరి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement