శ్రీవారి దర్శనానికి 18 గంటలు | 18 hours for Tirumala Srivari Darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

Aug 27 2024 8:36 AM | Updated on Aug 27 2024 8:36 AM

18 hours for Tirumala Srivari Darshan

తిరుమల: భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు  నిండాయి. క్యూ లైన్‌ టీబీసీ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకోగా 30,320 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.26 కోట్లు సమర్పించారు.

 టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శనం టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలై న్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్‌ లో అనుమతించరని తెలియజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement