జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం కొనసాగింది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం కొనసాగింది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

రెండో విడత ప్రచారానికి తెర

అనంతపురం ఎడ్యుకేషన్‌: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తెర పడింది. మూడు రోజుల పాటు మైకుల మోత, ప్రచార రథాల హడావుడితో హోరెత్తిన గ్రామాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. మరో 24 గంటల్లో జరగనున్న పోలింగ్‌లో ఓటరు ఎవరికి పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.

తొలి విడత ఫలితాలతో గుబులు

తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు గ్రామీణ ఓటర్లు పట్టం కట్టడంతో అధికార పార్టీ శిబిరంలో ఆందోళన మొదలైంది. రెండో విడతలో బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, నార్పల, పుట్లూరు, శింగనమల, యల్లనూరు, గుత్తి, గుంతకల్లు, పామిడి మండలాల్లోని 186 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో 51 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 135 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ బరిలో 367 మంది అభ్యర్థులు నిలిచారు. అలాగే 1,794 వార్డులకు గాను 950 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 825 వార్డులకు 1,749 మంది పోటీపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement