నిత్యం నెత్తురోడుతున్న రహదారి | - | Sakshi
Sakshi News home page

నిత్యం నెత్తురోడుతున్న రహదారి

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

ఎన్‌హెచ్‌–67పై భారీ వాహనాల అతివేగం, రోడ్డు మలుపులు, రోడ్లపై ఎక్కడిక్కడ వాహనాల నిలిపివేస్తుండడంతో ఈ ఏడాదిలో ముగ్గురు ద్విచక్ర వాహనదారులు మృత్యువాత పడ్డారు. జూన్‌ నెలలో జరిగిన ప్రమాదాల్లో గంగాదేవిపల్లెకు చెందిన రామాంజులరెడ్డి(40), మండలంలోని యుగడురుకు చెందిన సతీష్‌(25), విజయ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ మేనేజర్‌ విశ్వనాథ్‌(45) మరణించగా ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. అంతకుముందు జూలై 30న కొత్తపల్లి వద్ద కారు ఢీ కొన్న ప్రమాదంలో చంద్రకాంత్‌(27) ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అలానే అగస్టు నెలలో ఒకరు, ఆక్టోబర్‌ 7న భార్గవ్‌, పురుషోత్తంలు బైక్‌ పై వెళ్తూ తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో ఈ మార్గం గుండా ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. రాత్రివేళ హైవేపై నిలుపుతున్న లారీలు, కంటైనర్లు వాహనదారుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement