తిమ్మాపురంలో ‘పచ్చ’ దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

తిమ్మాపురంలో ‘పచ్చ’ దాష్టీకం

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

కళ్యాణదుర్గం: వైఎస్సార్‌సీపీ మద్దతుదారు విజయాన్ని ‘పచ్చ’ పార్టీ మూక జీర్ణించుకోలేకపోయింది. రాత్రి వేళ సర్పంచ్‌ ఇంటిపై దాడికి తెగబడింది. ప్రజా తీర్పును హేళన చేసింది. వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం తిమ్మాపురం సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గౌని రేణుక గెలుపొందారు. అయితే ఆమె గెలుపును టీడీపీ వారు అంగీకరించలేదు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి రీ కౌంటింగ్‌ చేయించినా ఫలితం అదే పునరావృతమైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న టీడీపీ కార్యకర్తలు నగేష్‌, నరేష్‌ శుక్రవారం గ్రామంలో మాటలతో కవ్వింపు చర్యలకు దిగారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలైన దళిత హరికృష్ణ, జనార్దన్‌తో పాటు మరో కార్యకర్త బోయ పాతన్నపై విచక్షణారహితంగా భౌతికదాడులు చేసి తీవ్రంగా గాయపరిచారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి.. ప్రజాతీర్పును శిరసావహించాల్సిందిపోయి ఆగ్రహంతో ఊగిపోతారా అంటూ గ్రామస్తులు తిరగబడ్డారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దళితులపై దాడులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని.. దాడి ఘటనపై కేసు నమోదు చేస్తామని చెప్పి వారిని ఇళ్లకు పంపించారు. అనంతరం దాడిలో గాయపడిన వారిని సర్పంచ్‌ భర్త తదితరులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

‘పచ్చ’ మూకల దాడిలో ధ్వంసమైన సర్పంచ్‌ గౌని రేణుక ఇంటి కిటీకీలు

దాడిలో ధ్వంసమైన కుర్చీలు

సర్పంచ్‌పై దాడికి యత్నం

గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లిన కొంతసేపటికే టీడీపీ కార్యకర్తలు మరోమారు మందీమార్బలంతో ఏకంగా సర్పంచ్‌ ఇంటిపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. నూతన సర్పంచ్‌ రేణుకపైనా దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. ‘పచ్చ’ మూకల గూండాయిజంతో ఇంట్లో ఉన్న సర్పంచ్‌ కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. వరుస దాడులతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ రేణుక ఇంటిపై దాడి

దళిత యువకులపై దాడి.. నిరసనగా గ్రామస్తుల ధర్నా

నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుకు డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement