నామినేషన్ల ట్యాంపరింగ్‌ నిజమే | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల ట్యాంపరింగ్‌ నిజమే

Nov 28 2026 1:32 AM | Updated on Nov 28 2026 1:32 AM

● తప్పు ఒప్పుకున్న ఆర్‌ఓ

● చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతల డిమాండ్‌

ఉరవకొండ: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎన్నికల అధికారులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లు తిరస్కరించడం వివాదాస్పదంగా మారింది. మూడో విడతలో భాగంగా ఎన్నికలు జరిగే ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీలో 5, 9, 14వ వార్డు స్థానాలకు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్లలో వివరాలు సరిగా లేవంటూ స్క్రూటినీలో ఆర్‌ఓ తిరస్కరించారు. సదరు అభ్యర్థులు శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్‌ఓ) సత్యనారాయణను నిలదీశారు. పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఎందుకు తిరస్కరించారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ఆర్‌ఓ స్పందిస్తూ నామినేషన్ల స్క్రూటినీ సమయంలో పొరపాటు జరిగిందని తప్పు ఒప్పుకున్నారు. నామినేషన్‌ పత్రాల్లోని వివరాలను ట్యాంపరింగ్‌ చేసి తిరస్కరించిన ఆర్‌ఓపైన, ప్రోత్సహించిన టీడీపీ నాయకులపైన క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుగు ఈడిగ ప్రసాద్‌, మహానంది, చేజాల ప్రభాకర్‌, బ్యాళ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్‌ కృత్రిమ మేధదే

అనంతపురం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) నాలుగో పారిశ్రామిక విప్లవంగా మారిందని, భవిష్యత్తు అంతా ఏఐ చుట్టూనే తిరుగుతుందని ఏపీ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కె.కళ్యాణి రాధ ఆధ్వర్యంలో ‘ఏఐ ఆధారిత మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఇంటెలిజెంట్‌ డిజైన్‌, స్మార్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, అధునాతన సిమ్యులేషన్లు, భవిష్యత్తు టెక్నాలజీలు’అనే అంశంపై ఐదు రోజుల టెక్నికల్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. శుక్రవారం ముగింపు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు ఏఐ ఆధారిత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. డాక్టర్‌ కె.కళ్యాణి రాధ మాట్లాడుతూ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగాన్ని సమూలంగా మార్చడంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement