ఊపందుకున్న రెండో విడత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న రెండో విడత ప్రచారం

Nov 26 2026 1:47 AM | Updated on Nov 26 2026 1:47 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్ర వారంతో ముగియనుంది. దీంతో ఇంటింటా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తొమ్మిది మండలాల పరిధిలో 186 సర్పంచ్‌ స్థానాలు, 1,794 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 51 సర్పంచ్‌ స్థానాలు, 950 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 135 సర్పంచ్‌ స్థానాలకు, 825 వార్డు స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 367 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 1,749 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమకు అనుకూలంగా ఓటర్లను మలుచుకునేందుకు అన్ని వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం, స్థానిక నేతలతో మంతనాలు, ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలతో ఎన్నికల వేడి పెంచుతున్నారు.

బుక్కరాయసముద్రంలో సర్పంచ్‌ అభ్యర్థి వసుంధరను గెలిపించాలని ప్రచారం చేస్తున్న

వైఎస్సార్‌సీపీ నాయకులు

నార్పలలో సర్పంచ్‌ అభ్యర్థి చిలమకూరు గోపాల్‌కు మద్దతుగా ఓటు అభ్యర్థిస్తున్న జెడ్పీటీసీ శివానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత నార్పల సత్యనారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement