అనంతపురం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలు ముగిశాయి. అనంతపురంలోని రామ్‌నగర్‌లోని లక్ష్మీనరసింహ టెన్నిస్ అకాడమీలో ఈ నెల 23 నుంచి అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల బాలబాలికలకు పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు రోజైన బుధవారం విజేత, రన్నరప్ జట్లకు మెమొంటోలు అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు డిసెంబర్ 5 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ముగింపు వేడుకలకు డీఈఓ అయ్యూబ్ హుస్సేన్, ఉప విద్యాశాఖాధికారులు శ్రీనివాసరావు, లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాఫ్ట్ టెన్నిస్ కోఆర్డినేటర్ బాబు, అబ్జర్వర్ చందానాయక్, జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు సత్యనారాయణ, రాధమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరాజుద్దీన్, ఏపీ పీఈటీ– ఎస్‌ఏ పీఈ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, నిర్వాహకులు నారాయణ, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తఫా, నిరంజన్‌రెడ్డి, చల్లా ఓబులేసు, రాం ప్రసాద్, తబిత, సుజాత, శకుంతల పాల్గొన్నారు.


