చదువులోనే కాదు.. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత ఇలా విభిన్న రంగాల్లో బాలలు ప్రతిభ చాటుతున్నారు. చిన్న వయసులోనే అసాధారణ నైపుణ్యాలు, ధైర్యసాహసాలతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. సృజనాత్మక ఆలోచనలు, పట్టుదల, ఏకాగ్రతతో ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నారు. శనివారం బాలల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న చిన్నారుల ప్రతిభా పాటవాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ధాన్య.. బహుముఖ ప్రజ్ఞ
అనంతపురం నగరానికి చెందిన ధాన్య బహుముఖ ప్రజ్ఞతో ప్రశంసలు అందుకుంటోంది. చిన్న వయసులోనే భగవద్గీత పఠన పోటీల్లో రాణిస్తోంది. తల్లిదండ్రులు తేజస్విణి, అరవింద్‌తో పాటు అమ్మమ్మ దుర్గాభవాని ప్రోత్సాహంతో నాలుగేళ్ల వయసు నుంచే రాగయుక్తంగా శ్లోకాలు పాడుతోంది. గత రెండేళ్లుగా శాసీ్త్రయ నృత్యం, కర్ణాటక సంగీతం నేర్చుకుంటోంది. ఇప్పటికే పలు ప్రదర్శనలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది పుణెలో జరుగనున్న జాతీయ స్థాయి భగవద్గీత పోటీలకు ఎంపికై ంది.
– అనంతపురం కల్చరల్:


