సోదనపల్లిలో రీపోలింగ్‌ జరపాలి | - | Sakshi
Sakshi News home page

సోదనపల్లిలో రీపోలింగ్‌ జరపాలి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

శింగనమల: మండలంలోని సోదనపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లోని పోలింగ్‌ బూతులకు సంబంధించి రీపోలింగ్‌ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణమ్మ కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగంలోని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతికి గురువారం విన్నవించింది. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగితే గెలవలేమని టీడీపీ నాయకులు ఉదయం 8 గంటలకే దౌర్జన్యంగా పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఏజెంట్లపైన దాడులు చేశారని తెలిపింది. ఏజెంట్లను దౌర్జన్యంగా బయటకు పంపారని, అంతటితో ఆగకుండా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే దాడులకు తెగబడ్డారని తెలిపింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు కూడాఅధికారి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆమె ఆవేదన చెందింది.

రేషన్‌ బియ్యం స్వాధీనం

డి.హీరేహాళ్‌(బొమ్మనహాళ్‌): మండలంలోని జాజరకల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలపై సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎవరూ నిల్వ చేశారు ? ఎక్కడ నుంచి తెచ్చారన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యాన్ని తొలుత పోలీస్‌ స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి స్టాంక్‌ పాయింట్‌కు తరలిస్తున్నట్లు గ్రామ వీఆర్‌ఓ జైపాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement