ముగిసిన ’ఇన్నోవేటర్స్‌ కాన్‌క్లేవ్‌–2026’ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ’ఇన్నోవేటర్స్‌ కాన్‌క్లేవ్‌–2026’

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

అనంతపురం: ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వ్యవస్థాపకతకు వేదికగా జేఎన్‌టీయూ అనంతపురంలో నిర్వహించిన జాతీయ స్థాయి ’ఇన్నోవేటర్స్‌ కాన్‌క్లేవ్‌–2026’ ఆదివారం ఘనంగా ముగిసింది. విస్తార విద్యానిధి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3,000 మందికి పైగా విద్యార్థులు, 300కు పైగా స్టార్టప్‌లు, 80 మందికి పైగా పరిశ్రమల ప్రముఖులు పాల్గొన్నారు. జేఎన్‌టీయూఏ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌.సుదర్శన రావు, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతికుమార్‌, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎ. చౌదరి, యాక్సెంచర్‌ గ్లోబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ పింగళి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), సైబర్‌ భద్రతపై వర్క్‌షాప్‌లు, స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌పై నిపుణులు విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. వీసీ సుదర్శనరావు మాట్లాడుతూ విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య సమన్వయం పెంచడానికి, యువతలోని ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడిందని వీసీ సుదర్శనరావు అన్నారు. అనంతరం కాన్‌క్లేవ్‌లో భాగంగా నిర్వహించిన విద్యార్థుల హ్యాకథాన్‌ విజేతలకు మొత్తం రూ.9 లక్షల నగదు పురస్కారాలను అందజేశారు.

హ్యాకథాన్‌ విజేతలు:

ప్రథమ బహుమతి (రూ.5 లక్షలు): టీమ్‌ మెడోరా (పీఈఎస్‌ కాలేజీ, రేవా, గీతం వర్సిటీల ఉమ్మడి బృందం)

ద్వితీయ బహుమతి (రూ.3 లక్షలు): టీమ్‌ వింట్రా (బీఐటీఎం, బళ్లారి)

తృతీయ బహుమతి (రూ.1 లక్ష): టీమ్‌ ఇంపీరియన్‌ (ముత్తాయమ్మాళ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, తమిళనాడు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement