జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గాలివేగం తగ్గి ఉక్కపోత పెరిగింది. గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో వాయువ్య దిశగా గాలి వీచింది.
మిడ్ పెన్నార్ డ్యాం దక్షిణ కాలువకు వెంటనే సాగు నీరు విడుదల చేయాలి. డ్యాం పరిధిలోని చివరి ఆయకట్టు భూముల వరకు సాగు నీరు అందించాలి. తాగునీటికి మాత్రమే నీరు విడుదల చేస్తారని తెలియడంతో చాలామంది వరి సాగు చేయకుండా ఆయకట్టు భూములు బీడుగా పెట్టుకున్నారు. దక్షిణ కాలువ పరిధిలో ఉన్న చెరువులకు నీరందించాలి. చెరువుల్లో నీరుంటే భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయ బోర్లలో నీరు సమృద్ధిగా ఉంటాయి.
– రాము, సీపీఐ నేత


