బస్సులొచ్చినప్పుడే వెళ్లండి! | - | Sakshi
Sakshi News home page

బస్సులొచ్చినప్పుడే వెళ్లండి!

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

అనంతపురం క్రైం/తాడిపత్రి రూరల్‌: చంద్రబాబు ప్రభుత్వ ఆర్భాటం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. మంగళవారం నెల్లూరు జిల్లాలో జరిగిన పల్లె పండుగ – 3.0 కార్యక్రమానికి అనంతపురం డిపో నుంచి స్పెషల్‌ సర్వీసుల పేరిట బస్సులు వెళ్లాయి. అనంతపురం ఆర్టీసీ డిపో నుంచి అధిక సంఖ్యలో బస్సులు పల్లె పండుగకు నెల్లూరు వెళ్లడంతో బండమీదపల్లి, బీకే హళ్లి, మదిరేపల్లి, పూలకుంట, నూతిమడుగు, వేపచెర్ల, రేగడికొత్తూరు, నంద్యాల, శ్రీశైలం, మంత్రాలయం ప్రాంతాలకు బస్సులను ఆర్టీసీ అధికారులు అధికారికంగా రద్దు చేశారు. అనధికారికంగా చాలా రూట్లు బస్సులు తిరగలేదని కార్మిక వర్గాలు తెలియజేశాయి.‘బస్సులు నెల్లూరు పల్లె పండుగకు బుక్కయ్యాయి.. అవి వచ్చినప్పుడే ప్రయాణికులు వెళ్లాలి’.. సమయపాలన అంటూ ఉండదు అంటూ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లోని నోటీసు బోర్డులో అతికించారు.ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లిన సందర్భంలో ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు పడిన ఇబ్బందులు వర్ణణాతీతం. తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు చంటి బిడ్డలతో బస్సుల కోసం వేచిచూస్తున్న బాలింతలు పడిన నరకయాతన అంతాఇంతా కాదు. ఈ ప్రకటన గమనించిన ప్రయా ణికులు చంద్రబాబు ప్రభుత్వంపై నిట్టూర్చారు.

గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఆపసోపాలు..

నిత్యం బస్సుల రాకపోకలతో సందడిగా ఉండే తాడిపత్రి ఆర్టీసీ ప్రాంగణం బస్సుల లేకపోవడం నిర్మానుషంగా మారింది. వైద్యం, వ్యాపారం, ఉద్యోగ అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే రోజువారీ ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు వృద్ధులు వేచి చూడలేక, చిన్నారుల తిప్పలు తాళలేక బాలింతలు, సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేక రోగులు పడిన అవస్థలు .. చంద్రబాబు ప్రభుత్వం పాలనాతీరు, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి.

ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు వింత అనుభవం

పల్లె పండుగకు స్పెషల్‌ పేరిట నెల్లూరుకు పంపిన బస్సులు

గమ్యస్థానాలకు వెళ్లేమార్గంలేక అవస్థలు

ఇబ్బందులకు గురైన వృద్ధులు, తల్లులు, రోగులు

ప్రత్యామ్నాయం చూపడంలో అధికారులు విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement