తెల్లబోయిన తెల్లబంగారం రైతు | - | Sakshi
Sakshi News home page

తెల్లబోయిన తెల్లబంగారం రైతు

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

తురకపల్లి వద్ద ట్రాక్టర్‌తో తొలగిస్తున్న పత్తిపంట

తొలగించిన పత్తి పంటను కుప్పలుగా వేస్తున్న రైతులు

పంట పండితే తెల్లబంగారమే.. అని ఎంతో ఆశగా సాగు చేసిన పత్తి రైతు.. ఈ ఏడాది వర్షాభావంతో పతనమయ్యాడు. సరైన సమయంలో వర్షాలు లేవు.. పంట ఎదుగుదల లేదు.. దిగుబడిపై ఆశ లేదు.. దీంతో గుత్తి మండలంలోని తురకపల్లి వద్ద ఎదుగూబొదుగులేని పత్తి పంటను తొలగించాల్సి వస్తోంది. మంగళవారం గ్రామ సమీపంలోని రైతులు పంటను ట్రాక్టర్‌తో దున్నేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవలేదు. మొక్కలు ఎదుగుదల లేక ఎండి పోయాయి. ఇటీవల రెండు, మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటలు పచ్చదనం సంతరించుకున్నా ఉపయోగం లేక పోయింది. కొన్నాళ్లపాటు ట్రాక్టర్‌ ట్యాంకర్లతో నీరు తరలించినా..ఆర్థికభారం తప్పా ఫలితంలేకపోయింది. గ్రామానికి చెందిన రైతులు హనుమంతురెడ్డి, ఉమేష్‌రెడ్డి పంట తొలగించారు. హనుమంతరెడ్డి 12 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా సుమారు రూ.7 లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. రైతు ఉమేష్‌రెడ్డిదీ అదే పరిస్థితి. సుమారు రూ.3లక్షలు నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. – గుత్తి రూరల్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement