ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

గుత్తి: గుత్తి కోటలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోట ముఖ ద్వారం వద్ద నుంచి విద్యార్థులు, కోట సంరక్షణ సమితి సభ్యులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.ముఖ్య అతిథులు ఎంపీ అంబికా, అసిస్టెంట్‌ కలెక్టర్‌ పీయూష్‌ కుమార్‌,జిల్లా టూరిజం అధికారి వెంకటరమణారెడ్డి, ఆర్డీ ఓబుళమ్మకు స్వాగతం పలికారు. అతిథులు పురాతన నాణేల ప్రదర్శన శాలను తిలకించారు. సభా స్థలి వద్ద విద్యార్థులు, చిన్నారులు ముఖ్యంగా జూనియర్‌ ఏఎన్‌ఆర్‌ విజయకుమార్‌ సినిమా పాటలకు డాన్స్‌లు చేసి అలరించారు. అతిథులు మాట్లాడుతూ గుత్తి కోటను అభివృద్ధి చేయడంతో పాటు టూరిజం హబ్‌గా చేస్తామన్నారు. కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ భాస్కర్‌, గైడ్‌ రమేష్‌, గాయకుడు సాధు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement