●ఇరుక్కుని.. ఇక్కట్లకు గురి చేసి | - | Sakshi
Sakshi News home page

●ఇరుక్కుని.. ఇక్కట్లకు గురి చేసి

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన కంటైనర్‌

అనంతపురం నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్‌ వద్ద బ్రిడ్జి కింది భాగంలో శనివారం భారీ కంటైనర్‌ ఇరుక్కుపోయింది. ఆ మార్గంలో రాకపోకలను స్తంభింపజేసింది. చివరకు పోలీసులు స్పందించి అతి కష్టంపై కంటైనర్‌ను జాతీయ రహదారిపైకి మళ్లించారు. ఇలా పలుమార్లు జరిగినా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా పోలీసులు సైతం వాటి రాకపోకలను నియంత్రించలేకపోతున్నారు. ఇకపై ఇలాంటి అవాంతరాలు తలెత్తకుండా పగటి పూట నగరంలోకి భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement