హిజ్రాలు డబ్బులు డిమాండ్‌ చేస్తే ఫోన్‌ చేయండి | - | Sakshi
Sakshi News home page

హిజ్రాలు డబ్బులు డిమాండ్‌ చేస్తే ఫోన్‌ చేయండి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● ఎస్పీ జగదీష్‌

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో దసర పండగ సందర్భంగా మామూళ్లంటూ హిజ్రాలతో పాటు ఎవరైనా సరే బలవంతపు వసూళ్లకు పాల్పడితే నేరుగా తనకే ఫోన్‌ చేయాలని ఎస్పీ జగదీష్‌ సూచించారు. శుక్రవారం నగరంలోని ఆర్యవైశ్య సంఘం నాయకులు, ప్రజలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి హిజ్రాల డబ్బు వసూళ్లపై ఫిర్యాదు చేశారు. ఎల్‌–నినో, ఇతరత్రా కారణాలతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈ సమయంలో హిజ్రాలు డబ్బుల కోసం బలవంతం చేస్తున్నారన్నారు. స్పందించిన ఎస్పీ జగదీష్‌ బలవంతపు వసూళ్లను ఉపేక్షించేది లేదని, ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పాల్పడితనే డయల్‌ 100 లేదా నేరుగా తనకే సమాచారం అందించాలని సూచించారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌

పోటీలకు ఎంపిక

బొమ్మనహాళ్‌: రాష్ట్రస్ధాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలను బొమ్మనహాళ్‌ మండలంలోని సింగానహాళ్లి ఉన్నత పాఠశాలో 10వ తరగతి చదువుతున్న హెచ్‌.రంజిత్‌కుమార్‌ ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు ప్రహ్లది నాయుడు, ఫిజికల్‌ డైరెక్టర్‌ జగదీష్‌ తెలిపారు. ఈనెల 24న అనంతపురం జిల్లాస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలు జరిగాయన్నారు. పోటీల్లో రంజిత్‌ ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో కడపలో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయన్నారు. రంజిత్‌ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ సందర్భంగా పీడీ జగదీష్‌ను అభినందించారు.

బడికి దూరమైన

విద్యార్థులను గుర్తించండి

అనంతపురం ఎడ్యుకేషన్‌: దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విద్యాశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి ప్రధానోపాధ్యాయులకు సూచించారు. బుక్కరాయసముద్రంలోని ఆర్డీటీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వివిధ విద్యా అంశాలపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దీర్ఘకాలికంగా పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి తిరిగి బడికి తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశం ఉదయం 10 గంటలకు ఉంటుందని సమాచారం ఇచ్చినప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందనే విషయం ముందుగా తెలియజేయకపోవడంతో పలువురు ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కేజీబీవీల్లో వనరుల నిర్వహణకు ‘ఈఆర్‌పీ’

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేజీబీవీల సెక్రటరీ దేవానందరెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న కేజీబీవీ ప్రిన్సిపాల్స్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌, వార్డెన్లకు శుక్రవారం ఈఆర్‌పీ, నాణ్యమైన భోజనం, విద్యార్థుల విద్యా ప్రగతిపై స్థానిక సైన్స్‌ సెంటర్‌లో అవగాహన శిక్షణ నిర్వహించారు. కేజీబీవీలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ప్రొవిజన్స్‌, ఇతర సామగ్రి అవసరాలను ముందుగానే అంచనా వేసి.. వాటి సరఫరా, నిల్వ, వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement