కాపురంలో చిచ్చురేపిన ‘అనుమానం’ | - | Sakshi
Sakshi News home page

కాపురంలో చిచ్చురేపిన ‘అనుమానం’

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

రాప్తాడు రూరల్‌: అనుమానం ఆ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. మూడోవ్యక్తి ప్రస్తావనతో కాపురంలో కలతలు రేగాయి. పెరిగిన గొడవలు చివరకు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇంట్లో గొడవలు చేసుకుంటే తల్లిదండ్రులకు తెలుస్తుందని, బయటకు వెళ్లి మాట్లాడుకుందామని భార్యను నమ్మించి తీసుకెళ్లిన భర్త...నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో గొంతుకోసి హతమార్చాడు. అనంతపురం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నేషనల్‌ పార్కు సమీపంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.

అనుమానంతోనే...

కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం రామకొండకు చెందిన ఎస్‌.అఖిల (26)కు అనంతపురం నగరం ఎర్రనేలకొట్టాలుకు చెందిన రాజేష్‌తో 2020లో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, కుమారుడు సంతానం. రాజేష్‌ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తొలినాళ్లలో అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు మొదలయ్యాయి. భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందనే అను మానం రాజేష్‌ను వెంటాడింది. ఈ విషయమై దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది.

బయటకు తీసుకెళ్లి...

భార్యతో గొడవపడితో ఇంట్లో తల్లిదండ్రులకు తెలుస్తుందని భావించిన రాజేష్‌..బయటకు వెళ్లి మాట్లాడుకుందామని అఖిలను నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను ఇంటినుంచి తీసుకెళ్లాడు. నేషనల్‌ పార్కు దాటిన తర్వాత కాలువ పక్కన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పదునైన కత్తితో అఖిల గొంతు కోశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

చిన్నారులకు తీరని శోకం

తల్లి హత్యకు గురికావడం, తండ్రి హంతకుడిగా మారడంతో ఐదేళ్ల కూతురు, మూడేళ్ల బాబు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. తల్లిదండ్రుల మధ్య నెలకొన్న అనుమానాలు, గొడవలు ఇద్దరు చిన్నారులకు తీరని వేదనను మిగిల్చాయి. కళ్లముందు పెరగాల్సిన పిల్లలకు తల్లిదూరం కావడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

పోలీసులకు ‘హద్దు’ చిక్కు

ఘటనా స్థలం ఏ పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలోకి వస్తుందనే విషయంలో కాసేపు గందరగోళం నెలకొంది. అడుగుల దూరం తేడాతో హద్దుల సమస్య తలెత్తింది. తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదని త్రీటౌన్‌, రూరల్‌ పోలీసులు తర్జనభర్జన పడ్డారు. చివరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన రూరల్‌ సీఐ శ్రీకాంత్‌యాదవ్‌ మాట్లాడుతూ...భార్యపై అనుమానంతోనే భర్త హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.

భార్యను కడతేర్చిన భర్త

మాట్లాడుకుందామంటూ శివార్లలో కత్తితో పొడిచి హత్య

మరో వ్యక్తితో సన్నిహితమే హత్యకు కారణమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement