దేవుడా.. ఎంత పని చేస్తివయ్యా.. | - | Sakshi
Sakshi News home page

దేవుడా.. ఎంత పని చేస్తివయ్యా..

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

● విద్యుదాఘాతంతో యువకుడి మృతి

● కన్నీరు మున్నీరైన కుటుంబ సభ్యులు

పామిడి: దేవుడా.. ఎంతపని చేస్తివయ్యా...చేతికొచ్చిన కొడుకునూ లేకుండా చేస్తివే...అంటూ కుమారుడి మృతిని తట్టుకోలేక తండ్రి రోదన చూపరులను కంటతడిపెట్టింది. ఈ దుర్ఘటన పామిడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు... స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లోని హనుమాన్‌ టాకీస్‌ క్రాస్‌లో తాతాయ్యగౌడ్‌ కోడిగుడ్ల వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవలే వాణినగర్‌లో తాను ఉన్న ఇంటి వెనుక నూతన గృహనిర్మాణ పనులు చేపట్టాడు. ఈక్రమంలో ఇంటి నిర్మాణ బెడ్డింగ్‌కు క్యూరింగ్‌ చేయడానికి పూనుకున్నాడు. తాతయ్యగౌడ్‌ మొదటి కుమారుడు రాహుల్‌గౌడ్‌ (22) ఇంట్లో నుంచి త్రీపిన్‌ ఫ్లగ్‌తో కూడిన విద్యుత్‌ వైరుకు బోర్‌ మోటారు వైరును అమర్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఇంటి మెయిన్‌ ఆఫ్‌చేసి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాహుల్‌ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. రాహుల్‌ ఐటీఐ పూర్తి చేసి తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేవాడని.. ఇంతలోనే దేవుడు ఎంత పనిచేశాడంటూ కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని పీఎం నిమిత్తం మార్చురీకి తరలించి, పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

తాడిపత్రిటౌన్‌: పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (60) మృతి చెందాడు. పట్టణంలోని మార్కెట్‌యార్డ్‌ ముందు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు అతన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, తెల్లచొక్కా, బ్లాక్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలిసిన వారు సెల్‌: 9440796861కు తెలియజేయలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement