బుక్కరాయసముద్రం/ పుట్లూరు: రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతూనే ఉన్నారు.. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.. రాష్ట్రంలో ఎల్–నినో ప్రభావం వల్ల వర్షాలు లేవంటున్నారు.. కూటమి ప్రభుత్వం రైతులకు గుక్కెడు నీరు అందించలేకపోతే ఎలా? రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు. పరిపాలన చేతకాకపోతే వెంటనే దిగిపోండి’ అని వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదివారం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి, దయ్యాలకుంటపల్లిలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎండిపోయిన వేరుశనగ పొలాలు, చీనీ తోటలను, అలాగే పుట్లూరు మండల కన్వీనరు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి పొలాలను శైలజానాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సాగునీరు వదులుతారనే ఆశతో 3.5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశానని, ఇప్పుడేమో నీళ్లు ఇవ్వలేమంటున్నారని చెన్నంపల్లికి చెందిన మహిళా రైతు సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, బోర్లల్లో నీరు రాక ఆరు ఎకరాల్లోని చీనీ పంట ఎండిపోతోందని మరో రైతు వెంకటరామిరెడ్డి వాపోయారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని అన్నారు.
వ్యవసాయ రంగంపై తీవ్ర నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చలేనప్పుడు.. సాగునీరు అందించలేనప్పుడు.. రైతుల తరఫున ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడతారా అంటూ విమర్శించారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువనేత డాక్టర్ సాకే రిత్విక్, గార్లదిన్నె మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, జయరామిరెడ్డి, మంత్రి ఆంజినేయులు, భాస్కర్‌రెడ్డి, ఉట్టి కాటమయ్య, సాకే రామాంజినేయులు, నాగయ్య, శ్రీనివాసరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, శ్యాం సుందర్‌రెడ్డి, సురేష్‌బాబు, లక్ష్మిరెడ్డి, నాగరాజు, నల్లపరెడ్డి, మనోహర్‌రెడ్డి, భాస్కర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. పుట్లూరు మండలంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్, జిల్లా రైతు విభాగం కార్యదర్శి శివారెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి దుర్గం రామాంజినేయులు, శింగనమల నియోజకవర్గ అధ్యక్షులు అంజి, పుట్లూరు మండల రైతు విభాగం అధ్యక్షులు రమణారెడ్డి, అనుబంధ విభాగాల నాయకులు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మనోహర్, ఓబుల్‌రెడ్డి, భీమేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, పోల్‌రెడ్డి, నారాయణస్వామి, రామ్మోహన్, రైతులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శైలజానాథ్


