కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో చదవడం అదృష్టం | - | Sakshi
Sakshi News home page

కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో చదవడం అదృష్టం

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

టీటీడీ మాజీ జేఈఓ శ్రీనివాసరాజు

పరిగి: కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో చదవడం తాము చేసుకున్న అదృష్టమని టీటీడీ మాజీ జేఈఓ, తెలంగాణ రాష్ట్ర ‘రెరా’ (రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) చైర్మన్‌ శ్రీనివాసరాజు అన్నారు. ఆదివారం కొడిగెనహళ్లి ఏపీఆర్‌ఎస్‌లో గోల్డెన్‌ జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరాజుతో పాటు నాటి పూర్వ విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ నరేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పూర్వ విద్యార్థులు సరస్వతీ దేవి విగ్రహానికి పూజలు చేసి నాటి ప్రార్థనా గీతాలను ఆలపించారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో కలయతిరిగి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

డీజేలు పూర్తిగా నిషేధం

అనంతపురం సెంట్రల్‌: వినాయక పండగ సందర్భంగా, నిమజ్జనం సమయంలో డీజేలు వాడడం నిషేధమని ఎస్పీ జగదీష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే సిస్టం సీజ్‌ చేయడంతో పాటు నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శబ్ద కాలుష్య నివారణలో భాగంగా సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

5 డీజే సిస్టంలు స్వాధీనం

ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దాలతో ఊరేగింపులు చేస్తున్న ఐదు డీజే సిస్టమ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement