నాకు 4.78 ఎకరాల పొలం ఉంది. రెండు బోర్లు ఉండగా నీళ్లు వస్తాయనే ఆలోచనతో 2 ఎకరాల్లో వేరుశనగ, మరో 2.78 ఎకరాల్లో కంది సాగు చేశా. అయితే వర్షాలు రాక బోర్లలో నీళ్లు క్రమేణా తగ్గిపోతున్నాయి. మోటార్ ఆన్ చేయగానే 10 నిమిషాలు అలా వచ్చి తర్వాత గుక్కపడుతున్నాయి. గంట తర్వాత ఆగిపోతున్నాయి. కనీసం వేరుశనగను కాపాడుకుందామన్నా సాధ్యం కావడం లేదు. రెండు పంటలు ఎండుముఖం పట్టాయి.
– రైతు భాస్కరరెడ్డి, పీటీఆర్ పల్లి,
కళ్యాణదుర్గం మండలం


