బొమ్మనహాళ్: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నేమకల్లు, మురడి ఆంజనేయస్వాముల బాలాలయాలకు శ్రావణమాస మూడో మంగళవారం భక్తులు పోటెత్తారు. ప్రధాన అర్చకులు అనిల్‌కుమారాచార్యులు, పవన్‌స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహానివేదన, మహామంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా దాతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఐలు నబీరసూల్, గురుప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.
ప్రత్యేక అలంకరణలో నేమకల్లు ఆంజనేయస్వామి
ప్రత్యేక అలంకరణలో మురడి ఆంజనేయస్వామి


