బొమ్మనహాళ్: ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువకుడిపై వేటకోడవళ్లతో దాడి చేసిన కేసులో నలుగురిని బొమ్మనహాళ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు వేటకొడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ నబీరసూల్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉరవకొండ మండలం పెద్ద ముష్టూరుకు చెందిన చరణ్ అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో రాజీ చేసిన్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇటీవల చరణ్ బొమ్మనహాళ్ మండలంలోని ఽశ్రీధరఘట్టలోని బంధువుల ఇంట్లో ఉంటూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో బాలిక ఫొటోలను పోస్ట్ చేస్తున్నాడన్నారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఈనెల 29న వేటకోడవళ్లతో చరణ్‌పై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చరణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం గోవిందవాడ క్రాస్ వద్ద మునీంద్ర, నారాయణస్వామి, వన్నూరుస్వామి, ప్రసాద్‌ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వేటకోడవళ్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


