లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం | - | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు

గుత్తి: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి లారీ ఢీ కొనడంతో ఓమ్నీ వ్యాన్‌లో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ బసవరాజ్‌ను అదుపులోకి తీసుకుని సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌ విచారణ చేశారు. ఘటనపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement