నలభై దాటితే నరకమే.. | - | Sakshi
Sakshi News home page

నలభై దాటితే నరకమే..

Aug 7 2026 1:50 AM | Updated on Aug 7 2026 1:50 AM

పెద్దపప్పూరు: ఫ్లోరైడ్‌ శాపం ఆ గ్రామాన్ని కుదిపేస్తోంది. తాగునీరు అందించే ప్రయత్నం చంద్రబాబు ప్రభుత్వం చేయకపోవడం వారికి శాపంగా మారింది. ఫిల్టర్‌ వాటర్‌ కొనలేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

గత ప్రభుత్వంలో

రూ.10 లక్షలతో పైప్‌లైన్‌

మండలంలోని అత్తిరాలదిన్నె గ్రామంలో 300 కుటుంబాలకు పైగా నివాసముంటున్నాయి. ఈ గ్రామాన్ని తాగునీటి సమస్య వేధిస్తోంది. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్‌ నీరే ఉండడంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. 40 ఏళ్ల వయస్సు దాటితే కాల్షియం లోపంతో కాళ్లు వంకర్లు పోవడం, నొప్పులు తీవ్రం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందించి 2022లో దాదాపు రూ.10 లక్షల వరకూ ఖర్చుచేసి గండికోట రిజర్వాయర్‌ నీటిని అందించేందుకు పైపులైన్‌ ఏర్పాటు చేసింది. కొద్ది రోజులు నీటి సరఫరా జరిగినా అనంతరం పైపులైన్లు పగిలిపోవడంతో నీటి సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

నిద్రావస్థలో చంద్రబాబు సర్కార్‌

తాగునీటికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో గ్రామంలో ఉన్న బోరు బావి నుంచి వస్తున్న ఫ్లోరైడ్‌ నీటినే వాడుకునే దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం కనీసం చిన్నపాటి మరమ్మతు కూడా చేయించలేకపోవడంతో స్థానికులు నరకం చూస్తున్నారు. నిత్యం నొప్పుల మాత్రలు మింగుతూ ఉపశమనం పొందాల్సి వస్తోంది. చాలా మంది వంకర్లు తిరిగిన కాళ్లతో నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్నపాపాన పోలేదు. కనీసం ఇప్పటికై నా స్వచ్ఛమైన నీటిని అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నొప్పుల మాత్రలు మింగుతున్నాం

బోరుబావి నుంచి వచ్చే నీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉంది. ఆ నీటి వాడకంతో కీళ్ల నొప్పులు వచ్చాయి. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాము. నొప్పుల మాత్రలు వేసుకుంటేనే పనులు చేసుకోగలుగుతున్నాము. – భాస్కర్‌రెడ్డి , అత్తిరాలదిన్నె

పైపులైన్‌ ఉన్నా నీటి సరఫరా లేదు

గండి కోట ప్రాజెక్టు నుంచి కొట్టాలపల్లికి తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతంలో ఉండడంతో పైపులైన్‌ లీకేజీలు ఏర్పడుతున్నాయి. చిన్నపాటి మరమ్మతు చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. – నారాయణరెడ్డి, అత్తిరాలదిన్నె

ఎవరూ పట్టించుకోలేదు

నీటి సమస్యతో బాధపడుతున్నారని అధికారులకు తెలిసినా కన్నెత్తి చూడడం లేదు. 40 ఏళ్లు దాటిన వారంతా నొప్పులతో బాధపడాల్సి వస్తోంది. నూతన బోరు ఏర్పాటు చేసి ఫ్లోరైడ్‌ లేని నీటిని అందించాలి. – రామాంజులరెడ్డి, అత్తిరాలదిన్నె

ఫ్లోరైడ్‌ నీటితో అల్లాడిపోతున్న

అత్తిరాలదిన్నె గ్రామస్తులు

కాళ్లు వంకర్లు తిరిగి నడిచేందుకూ ఇబ్బందులు

మాత్రలతో ఉపశమనం

పొందుతున్న వైనం

తాగునీటి పైప్‌లైన్‌ ఉన్నా

నీళ్లు రాని వైనం

పట్టించుకోని అధికారులు,

ప్రజాప్రతినిధులు

గ్రామం పేరు అత్తిరాలదిన్నె కుటుంబాలు 300

వంకర కాళ్లను చూపుతున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement