బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం 44,782 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో.. ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు తగ్గింది. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1633 అడుగులకు గాను 1601.08 అడుగుల మేర నీటిమట్టం ఉంది. డ్యాం నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను 23 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 25,120 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 381 క్యూసెక్కులుగా నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.13 అడుగులతో 76.91 టీఎంసీల నీరు నిల్వ ఉండి.. 46,579 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 36,026 క్యూసక్కుల నీటిని గేట్లు ఎత్తి నదికి వదిలారు.
25,120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో


