కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి | - | Sakshi
Sakshi News home page

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి

Jul 13 2026 4:19 AM | Updated on Jul 13 2026 4:19 AM

పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి గ్రామ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. నార్పల–పుట్లూరు మండలాల సరిహద్దు ప్రాంతంలో ఈ పందేలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుండగా భారీగా బెట్టింగ్‌లు వేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల సమాచారాన్ని తెలుసుకున్న దాదాపు 50 మందికి పైగా ఉన్న జూదరులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కోడి పందేల స్థావరం వద్ద మూడు పందెం కోళ్లతో పాటు 39 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని పుట్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సీఐ సత్యబాబు పరిశీలించారు.

యోగా పోటీల్లో

భాగస్వాములు కండి

అనంతపురం కల్చరల్‌: యోగాసనా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసనా పోటీలు ఈనెల 19న జరగనున్నాయి. ఈ మేరకు నగరంలోని అసోసియేషన్‌ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఆ సంఘం చీఫ్‌ పాట్రన్‌ కేవీ రమణ, అధ్యక్షుడు మెళవాయి రాజశేఖరరెడ్డి, యోగా గురువులు మారుతీప్రసాద్‌, ఆంజనేయులు, దివాకర్‌ పోటీల వివరాలు తెలిపారు. వచ్చే ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభయ్యే పోటీల్లో సీ్త్ర, పురుషుల విభాగాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. ఒక యోగా క్రీడాకారుడు రెండు విభాగాల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ట్రెడిషనల్‌ యోగా, ఆర్టిస్టిక్‌ యోగాసనా సింగిల్‌, ఆర్టిస్టిక్‌ యోగాసనా పెయిర్‌, రిథమిక్‌ పెయిర్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి కల్గిన వారు 9963028694, 9440288899 నంబర్లకు ఫోన్‌ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

అనంతపురం: నగరంలోని అశోక్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ ఎంపిక కోసం జిల్లా స్థాయి పోటీలను ఆదివారం నిర్వహించారు. అండర్‌–11 బాలిక సింగల్స్‌ విభాగంలో ఏ. హారిక, ఎస్‌.సన, అండర్‌–11 బాలికల డబుల్‌ విభాగంలో అనిత– వేద, ఏ.హర్షిత– ఎస్‌. సన, అండర్‌–11 బాలుర విభాగంలో ఏ. స్వరూప్‌, కే.రిత్విక్‌, అండర్‌–11 బాయ్స్‌ డబుల్స్‌ విభాగంలో ఆర్‌. హర్షిత్‌కుమార్‌–అయాన్‌, పి.స్వరూప్‌–హిమేష్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బి.బుగ్గయ్య చౌదరి, సెక్రెటరీ ఏఎం.జయకుమార్‌, ఈసీ సభ్యులు ఎం. నరేష్‌, సి.రామాంజినేయులు, బి. బోగేష్‌, ట్రెజరర్‌ పి. శాంబమూర్తి ఎంపికై న క్రీడాకారులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement