అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు

Jul 13 2026 4:19 AM | Updated on Jul 13 2026 4:19 AM

పెద్దవడుగూరు: టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిని వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. గార్లదిన్నెలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దని .. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. వారి వెంట మండల కన్వీనర్‌ ఎద్దుల శరభారెడ్డి, వాల్మీకి సజ్జలదిన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement