పశువుల సంతలో డిజిటల్‌ రసీదులు | - | Sakshi
Sakshi News home page

పశువుల సంతలో డిజిటల్‌ రసీదులు

Jul 13 2026 4:19 AM | Updated on Jul 13 2026 4:19 AM

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ప్రతి శని, ఆదివారం జరిగే జీవాలు, పశువుల సంతల్లో ఇక నుంచి డిజిటల్‌ పద్దతిలో రసీదు అందజేస్తామని ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.గోవిందు తెలిపారు. ఆదివారం కంప్యూటర్లు, స్కానర్లు ఏర్పాటు చేసి డిజిటల్‌ విధానాన్ని ప్రారంభించారు. మాన్యువల్‌ పద్దతిలో ఇప్పటి వరకు రసీదు బుక్కులతో ఫీజులు వసూలు చేస్తుండగా ఇక నుంచి డిజిటల్‌ రసీదులు అందజేస్తామన్నారు. మున్ముందు రైతులు, వ్యాపారుల నుంచి నగదు కాకుండా డిజిటల్‌ రూపంలో ఫీజు వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీని ఫీజు వసూళ్లలో పారదర్శకత ఉంటుందన్నారు. ఇప్పటికే చీనీ మార్కెట్‌లో ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. మార్కెటింగ్‌శాఖ పరిధిలో క్రయ విక్రయాలు, రవాణా, వివిధ రకాల ఫీజులు, అద్దెలు, రెన్యూవల్స్‌ తదితరాలన్నీ ఆన్‌లైన్‌ పర్మిట్ల ద్వారా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో గ్రేడ్‌–2 సెక్రటరీ రూప్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement