సిలిండర్ర్‌ | - | Sakshi
Sakshi News home page

సిలిండర్ర్‌

Mar 13 2026 7:53 AM | Updated on Mar 13 2026 7:53 AM

ఆన్‌లైన్‌లో బుకింగ్‌ తీసుకోని వైనం

ఆందోళనలో వినియోగదారులు

అనంతపురం అర్బన్‌: ‘డొమెస్టిక్‌ గ్యాస్‌ కనెక్షన్లకు సిలిండర్ల కొరత లేదు.. యథావిధిగా సరఫరా అవుతున్నాయి.. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..’ అని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సిలిండర్‌ అందే విషయం అటుంచితే అసలు బుకింగే కావడం లేదు. పలుమార్లు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో.. ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు.

కాల్‌ కట్‌..

గ్యాస్‌ బుక్‌ చేసుకునేందుకు వినియోగదారులు తమ సెల్‌ ఫోన్‌ ద్వారా ప్రయత్నిస్తే కాల్‌ కట్‌ అవుతోంది. మరికొందరికి కొద్దిసేపు ఆగి ప్రయత్నించండంటూ వాయిస్‌ వస్తోంది. తర్వాత ప్రయత్నించినా ఉపయోగం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ బుక్‌ కాకపోతే పరిస్థితి ఏమిటంటూ మండిపడుతున్నారు.

సర్వర్‌ సమస్య ఉందంటున్నారు

గ్యాస్‌ బుకింగ్‌ కావడం లేదనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడాం. సర్వర్‌లో సాంకేతిక సమస్య ఉంది అని చెప్పారు. పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

– వెంకటేశ్వర్లు, జిల్లా సరఫరాల అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement