2 వేల అరటి చెట్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

2 వేల అరటి చెట్లు దగ్ధం

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

2 వేల

2 వేల అరటి చెట్లు దగ్ధం

యల్లనూరు: అగ్నిప్రమాదంలో 2 వేల అరటి చెట్లు దగ్ధమైన ఘటన యల్లనూరు సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రైతులు మహబూబ్‌బాషా, రఫీలు యల్లనూరు సమీపంలో పదెకరాల్లో 15 వేల అరటి మొక్కలను సాగు చేస్తున్నారు. పొలం పక్కనే బీడు భూమి ఉంది. అందులో పెరిగిన గడ్డికి ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో మంటలు పక్కనే ఉన్న అరటి తోటకు వ్యాపించి 2 వేల అరటి చెట్లు దగ్ధమయ్యాయి. నాలుగు మోటర్లు, ట్రాక్టరు డ్రిప్‌ పైపులు, 70 పీవీసీ పైపులు కూడా కాలిపోవడంతో రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. రెండో కోతకు గెలలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సోమవారం ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వీఆర్వో ఽశివశంకర్‌ పంట నష్టం నివేదికలను తయారు చేసి తహీసీల్దారు రాముకు సమర్పిస్తామన్నారు.

2 వేల అరటి చెట్లు దగ్ధం 1
1/1

2 వేల అరటి చెట్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement