నేటి నుంచి ‘కీబోర్డ్స్ టు విలేజెస్’
అనంతపురం: వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 16 వరకు రైతు కష్టాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సంకల్పం ‘కీబోర్డ్స్ టు విలేజెస్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు, మహిళలు పడుతున్న ఇబ్బందులు, పల్లె స్థితిగతులను ‘కీ బోర్డ్స్ టు విలేజెస్’ ద్వారా వెలుగులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు వచ్చే ఐటీ ఇంజినీర్లు, వివిధ వృత్తి నిపుణులు, ప్రైవేట్ ఉద్యోగులు నేరుగా ఆయా పల్లెల్లోని మహిళలు, వృద్ధులతో మాట్లాడి వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తారన్నారు. ఇప్పటికే రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేయర్ వసీం సలీం, సోషల్ మీడియా విభాగం అనంతపురం నియోజకవర్గం అధ్యక్షుడు పవన్‌కుమార్ శ్రావణ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, రాధాకృష్ణ, దామోదర్‌రెడ్డి, శేఖర్ నాయుడు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


