పోలీసుల అదుపులో టీడీపీ వర్గీయులు
యల్లనూరు: స్థానిక తేరు వద్ద ఈ నెల 1న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడిన 23 మంది టీడీపీ వర్గీయుల్లో శుక్రవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సత్యబాబు, ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పట్టుబడిన వారిలో సుబ్బరాయుడు, పవన్, ధర్మ ఉన్నారు. నిందితులను ఎస్పీ ఎదుట హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం.
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ప్రియాంకనగర్‌లో నివాసముంటున్న ఆటో డ్రైవర్ రామకృష్ణ (59) శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాగుడుకు బానిస కావడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. అలాగే నగరంలోని నీరుగంటివీధిలో నివాసముంటున్న మంగల హేమకుమార్ (37) ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా కరీమ్ అనే వ్యక్తితో స్నేహంగా ఉంటూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాడు. ఇటీవల కరీమ్‌కు వివాహం నిశ్చయమైంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ వాహనాల
బ్యాటరీల అపహరణ
గుత్తి: స్థానిక మున్సిపాలిటీకి చెందిన మూడు ట్రాక్టర్లు, నాలుగు వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్లు, రెండు కంపాక్టర్లు, ఒక సెప్టిక్ ట్యాంకు క్లీనర్ వాహనం బ్యాటరీలకు సంబంధించి మొత్తం 10 బ్యాటరీలను దుండగులు అపహరించారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై మున్సిపల్‌మేనేజర్ రాంబాబు, శానిటర్ ఇన్‌స్పెక్టర్ మహబూబ్ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గుత్తి ఆర్‌ఎస్‌లోని చంద్రప్రియ నగర్‌లో కేజీఎన్ వాటర్ ప్లాంట్‌కు చెందిన రెండు వాటర్ ట్రాలీ ఆటోల బ్యాటరీలనూ దుండగులు అపహరించారు. ఈ ఘటనపై ప్లాంట్ యజమాని అబ్దుల్ గని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల అదుపులో టీడీపీ వర్గీయులు
పోలీసుల అదుపులో టీడీపీ వర్గీయులు
పోలీసుల అదుపులో టీడీపీ వర్గీయులు


