అక్రమ కేసులకు భయపడొద్దు
మన బలగం పెరగాలి. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని జగన్ భరోసా ఇచ్చారు. కమిటీలో సభ్యత్వం తీసుకుని డిజిటలైజేషన్ చేయించుకుంటే అమరావతిలోని మన పార్టీ కార్యాలయంలో బటన్ నొక్కినా వివరాలు కనిపిస్తాయి. వచ్చేది జగన్ ప్రభుత్వమే. జగన్ 2.0లో కష్టకాలంలో వెంట నడిచిన ప్రతి కార్యకర్తకూ పదవి ఖాయం. జగన్ మాట తప్పని మనిషి అనే విషయం అందరికీ తెలిసిందే. మూడు పార్టీలు కలిసి వచ్చి.. అబద్ధపు హామీలు గుప్పించి దొంగ దెబ్బ కొట్టారు. వచ్చే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో మెజారిటీ సీట్లు సాధిద్దాం. జగన్ పేరు వింటే మూడు పార్టీల నాయకులకు నిద్ర పట్టదు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. జగన్ ప్రభుత్వం రాగానే కేసులన్నీ కొట్టిపారేస్తాం. – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు


