భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా విభాగాల్లో కమిటీలు నియమించారు. అందులో 70 శాతం వరకు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. మిగతా వాటిల్లో కూడా వీలైనంత తొందరగా నియామకాలు చేపట్టి డిజిటలైజేషన్ చేద్దాం. పార్టీ అధినేత సూచన మేరకు ఫిబ్రవరి 15 నాటికి కమిటీలు పూర్తి చేద్దాం. వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తోన్న ప్రతి కార్యకర్తకు సభ్యత్వం చేయిద్దాం. పార్టీ తర ఫున బీమా సౌకర్యం ఉంటుంది. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ గెలవడం ఖాయం. –చల్లా మధుసూదన్‌రెడ్డి,
వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జోనల్ ఇన్‌చార్జ్


