ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
అనంతపురం: కొంగొత్త ఆశలు.. ఆకాంక్షలతో నూతన సంవత్సరం ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని కోరారు. సరికొత్త లక్ష్యాలను సాధించడానికి నూతన ఏడాది ప్రేరణ కావాలన్నారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలతో ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయంలో ఆధునాతన సాంకేతికతను (అగ్రిటెక్) వినియోగించుకుని అధిక దిగుబడులు పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
జిల్లా వ్యవసాయ అధికారి బాధ్యతల స్వీకరణ
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ)గా ఎం.రవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న డీఏఓ ఉమామహేశ్వరమ్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ విరమణ చేస్తూ.. బాధ్యతలను ఎం.రవికి అప్పజెప్పారు. సీనియర్ ఏడీఏగా తాడిపత్రి డివిజన్‌లో పనిచేస్తున్న ఎం.రవిని ఎఫ్‌ఏసీ డీఏవోగా నియమిస్తూ 15 రోజుల కిందటే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ చేసిన డీఏఓకు వీడ్కోలు చెబుతూ నూతన డీఏఓ రవికి ఆ శాఖ ఏడీఏలు, ఏఓలు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
నిధులు పూర్తిస్థాయిలో
ఖర్చు చేయాలి
అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయా శాఖల పరిధిలో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు ఖర్చు చేయాలన్నారు. ఆ వర్గాల వారికి కేటాయించిన లక్ష్యం మేరకు ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఆర్‌డీఏ పరిధిలో సీ్త్రనిధి కింద రుణాల మంజూరులో, ఉన్నతి, పీఎంఎఫ్ ఎంఈ పథకాల్లో నిర్దేశించిన లక్ష్యాల్లో పురోగతి సాధించాలని సూచించారు. ఉపాధి హామీ కింద ఆ వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్, ఏపీఎంఐపీ, వ్యవసాయం, పౌర సరఫరాలు, పురపాలక, తదితర శాఖల పరిధిలో లక్ష్యాలను అధిగమించాలన్నారు. మునిసిపల్ కమిషనర్లతో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, డీటీడబ్ల్యూఓలు సమన్వయం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలన్నారు.
ఎంటెక్, ఎంఫార్మసీ
ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన లాస్ట్ ఛాన్స్ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ ) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి


