ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చూడండి : డీఈఓ
అనంతపురం సిటీ: ఉపాధ్యాయుల ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఈఓ ప్రసాద్‌బాబు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన సమావేశమై మాట్లాడారు. ఇప్పటి వరకు ఈపీఎఫ్‌కు సంబంధించి అందిన దరఖాస్తులు, ఎన్ని క్లియర్ చేశారు, పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయనే అంశాలపై ఆరా తీశారు. ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్‌లో పెట్టడానికి వీల్లేదని, తక్షణం క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చీనీ పంట పరిశీలన
కూడేరు: చలి తీవ్రత కారణంగా చీనీలో నల్లి, పేనుబంక, తామరపురుగు, మంగు తెగుళ్లు ఆశించినట్లు నియోజకవర్గ ఉద్యాన అధికారి యామిని తెలిపారు. చీనీలో ఆశించిన తెగుళ్లపై ‘చీనీకి తెగుళ్లు... రైతన్నకు దిగులు’ శీర్షికన గత నెల 24న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆమె స్పందించి, బుధవారం కూడేరు మండలంలో పర్యటించి చీనీ తోటలను పరిశీలించారు. నల్లి, ఆకుపచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1ఎంఎల్ ప్రోపర్‌గైట్ లేదా 0.8ఎంఎల్ స్పైరోమెసిఫిన్ లేదా 1ఎంఎల్ ఫెన్జాక్వీన్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మళ్లీ 20 రోజుల తర్వాత కూడా ఇదే ద్రావకాన్ని మరోసారి పిచికారీ చేస్తే ఆశించిన మేర ఫలితాలు ఉంటాయన్నారు. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 5ఎస్‌సీ, 2మిలీస్పైనోసాడ్ 45ఎస్‌సి 0.4మిలీ లీటర్ నీటిలో కలపి 14 రోజులు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. పేను బంకు, ఎగిరే పేను నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.85ఎస్‌ఎల్, 0.4 ఎంఎల్ లేదా ధయోమిథఽక్సామ్25డబ్ల్యూజి 0.3జీఎల్‌ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు.


