నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి గ్రామానికి చెందిన రామాంజి, అశ్వని దంపతులు కుమార్తె ఈక్షిత (2) మంగళవారం ఇంటి ఆవరణలో ఆదుకుంటూ సమీపంలోని నీటి తొట్టెలో పడిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఈక్షిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


