●మంచు కురిసే వేళలో..
శీతాకాలం కావడంతో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం పది గంటలైనా మంచు తెరలు తొలగడం లేదు. తెల్లవారుజామున చలి మరింత వణికిస్తోంది. అయినా ప్రజల దైనందిన పనులు ఆగడం లేదు. చలిలోనే పొలం పనులకు వెళ్తున్న రైతులు, కూలీలు, స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన విద్యార్థులతో గ్రామీణ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఆహారాన్వేషణకు సిద్ధమైన పక్షులు, ఇతర జీవరాశులతో ప్రకృతి రమణీయంగా గోచరిస్తోంది. ఆదివారం అనంతపురం–నార్పల మార్గంలో కన్పించిన దృశ్యాలివీ.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
అనంతపురం
●మంచు కురిసే వేళలో..
●మంచు కురిసే వేళలో..
●మంచు కురిసే వేళలో..
●మంచు కురిసే వేళలో..


