జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం
యజ్ఞంలా
వంద రోజుల ప్రణాళిక
అనంతపురం సిటీ: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ను ఒక యజ్ఞంలా చేపట్టాలని కడప ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. శనివారం ఆయన రీజనల్ పరిధిలోని అన్ని జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఏడీలు, సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ క్లాసులకు పదో తరగతి విద్యార్థుల హాజరు రోజురోజుకూ తగ్గిపోతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థీ విధిగా ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రోజూ స్లిప్ టెస్టులు పెట్టి.. మార్కులను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిందేనన్నారు. లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో కావలిన వసతుల గురించి యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఎంతమంది పిల్లలు, ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం కచ్చితంగా ఉండాలన్నారు. సరైన సమాచారాన్ని ఈ నెల 31లోగా యాప్‌లో నమోదు చేయాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు అన్ని విధాలా సహకరించి సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఏడీ శ్రీనివాసరావు, పరీక్షల విభాగం ఏసీ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక
అనంతపురం సిటీ: నగర శివారులోని ఏజీఎస్ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక ప్రక్రియకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 12 మంది బాలికలు, 12 మంది బాలురు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ గట్టు నాగరాజు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన నందిని, సాయిశ్రీ, శ్రావణి, అమృత, గాయత్రి, సుస్మిత, మహాలక్ష్మీ, త్రివేణి, గాయత్రి, వైజయంతి, అలేఖ్య, తేజశ్రీ ఎంపికయ్యారని వివరించారు. బాలుర విభాగంలో డింపుల్ సాయినాథ్, జీవంత్, రేవంత్, రాంచరణ్, నవనీత్, రిషిధర్, చక్రి, హేమసాయి, వరుణ్ సందేశ్, సాయిచరణ్, వినోద్‌కుమార్, సుభాష్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రగ్బీ టోర్నమెంట్ సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో పీడీలు సుదర్శన్, మురళి, చంద్ర నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.


