ఆటో బోల్తా : డ్రైవర్ మృతి
కణేకల్లు: మండలంలోని పూలచెర్ల గ్రామ శివారులో ఆటో బోల్తా పడిన ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు..పూలచెర్ల గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ (20) తన స్నేహితునితో కలిసి పూల్లంపల్లికి బయలుదేరాడు. పూలచెర్ల గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో వినోద్‌కుమార్ తీవ్రగాయాలయ్యాయి. మరోవ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వినోద్‌కుమార్‌ను బళ్లారి విమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


