రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో మనోళ్ల ప్రతిభ
అనంతపురం సిటీ/యాడికి: జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెర్‌లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో కణేకల్లు మండలం హనకనహాళ్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రవళ్లిక, నవాజ్, యాడికి మండలం కోనుప్పులపాడు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని సుహాసిని, ఉరవకొండ కేసీజీహెచ్‌ఎస్‌కు చెందిన చంద్రశేఖర్, కోనాపురం హైస్కూల్ విద్యార్థి సాత్విక్ ఉన్నారు. వీరు జనవరి 19 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో జరిగే సౌత్ ఇండియా సైన్స్‌ఫెయిర్ పోటీల్లో వారివారి ప్రాజెక్ట్‌లను ప్రదర్శించనున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి, ఇన్‌చార్జ్ డీఈఓ మల్లారెడ్డి, జిల్లా సైన్స్‌సెంటర్ అధికారి నరసింహారెడ్డి, కోనుప్పలపాడు ఉపాధ్యాయులు అభినందించారు.
జాతీయ స్థాయికి ఎంపికై న ప్రవళ్లిక, నవాజ్‌ను అభినందిస్తున్న ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి
విద్యార్థిని సుహాసినిని అభినందిస్తున్న దృశ్యం
రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో మనోళ్ల ప్రతిభ


