గ్రామాలను అభివృద్ధి బాట పట్టిద్దాం
●జెడ్పీ సీఈఓ శివశంకర్
ఆత్మకూరు: సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ చెత్తను రోడ్లపై వేయరాదని, తడి పొడి చెత్తలను వేరు చేసి పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు అందజేయాలని సూచించారు. మురుగు నీరు రోడ్లపై విడవరాదన్నారు. తాగునీటి నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హరిత వనాన్ని పరిశీలించి, అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రిప్ లక్ష్యాలు పూర్తి చేయాలి
● ఏపీఎంఐపీ పీఓ వెంకటేశ్వర్లు ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్: నిర్దేశిత గడువు లోపు 18 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాల సరఫరా వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు అధికారి (పీఓ) ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అఽధికారులు, పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బి.ధనుంజయతో పాటు డ్రిప్ కంపెనీ డీసీఓలు, ఎంఐ ఇంజనీర్లతో వీడియో కాన్పరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ డ్రిప్ పరికరాలు అందించాలన్నారు. పరికరాల నాణ్యత విషయంలో రాజీపడకూడదని, పరికరాల పనితీరుపై ట్రయల్‌రన్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 12,530 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేసినట్లు పీడీ తెలిపారు.
మూడు రోజులుగా దళిత వాడకు అందని తాగునీరు
కూడేరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న దళితవాడ, మరికొన్ని వీధులకు మూడు రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బోరు వేసి మోటర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మోటర్ చెడిపోవడంతో మరమ్మతులు చేయించలేదు. దీంతో ఆయా కాలనీలకు నీరు అందకుండా పోయింది. ఎంపీడీఓ కార్యాలయంలోని టాయిలెట్లకు కూడా నీటి సరఫరా ఆగి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి మోటారుకు మరమ్మతులు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
సీ్త్రనిధి రుణాలు
సద్వినియోగం చేసుకోండి
● డీఆర్‌డీఏ పీడీ శైలజ
అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా స్వయం సంఘాల సభ్యులకు డీఆర్‌డీఏ పీడీ టి.శైలజ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 35 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.289 కోట్లు కేటాయించారు. ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షలున్న రుణ పరిమితిని రూ.8 లక్షలకు పెంచారు. దీంతో పాటు అత్యవసరంగా రుణాలు కావాల్సిన సభ్యులకు సైతం రూ.1లక్ష వరకు అందించనున్నారు. దీంతో పాటు జీవనోపాధుల కింద సైతం రుణాలను అందజేయనున్నారు.
గ్రామాలను అభివృద్ధి బాట పట్టిద్దాం


