వైభవంగా గ్రామ దేవర వేడుకలు
బత్తలపల్లి: మండలంలోని జలాలపురంలో గ్రామదేవత పెద్దమ్మతల్లి దేవర వేడుకలు మంగళవారం వైభవంగా మంగళవారం నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి జ్యోతులు, బోనాలు సమర్పించారు. అర్చకులు కుంకుమార్చన, విశేష అలంకరణ చేశారు. గ్రామంలోని అన్ని ఆలయాలకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో వెళ్లి టెంకాయలు సమర్పించారు. అనంతరం జంతుబలులు ఇచ్చారు. బంధువులను, స్నేహితులను విందులకు ఆహ్వానించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేత కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత హరీష్‌బాబు తదితరులు పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఓబులపతి, ధర్మవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమతం ఈశ్వరయ్య, రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శి చల్లా మహేష్‌నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి సురేష్‌కుమార్, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, సర్పంచు సానే జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


