కదిరి అర్బన్: మండలంలోని ఎరుకులవాండ్లపల్లిలోని హరీష్ పాఠశాలలో ఈ నెల 26న ఉమ్మడి జిల్లా గోల్ షాట్‌బాల్ సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా జట్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు గోల్ షాట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు. వెంట ఆధార్ కార్డు తీసుకుని బుధవారం ఉదయం 11 గంటలకు హరీష్ పాఠశాలకు చేరుకోవాలి. పూర్తి వివరాలకు 97041 40510 లో సంప్రదించవచ్చు.
బీకేఎస్‌లో రేపు నైపుణ్య పోటీలు
అనంతపురం సిటీ: ఈ నెల 22న స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో జిల్లా స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సమగ్రశిక్ష ఏపీసీ శైలజ గురువారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఒకేషనల్ కోర్సు నిర్వహిస్తున్న 73 పాఠశాలల్లో ఎంపిక చేసిన విద్యార్థులు ఒక్కో ఒకేషనల్ ట్రైనర్ ద్వారా రెండు నమూనాలతో హాజరు కావాలన్నారు.


