ఘనంగా గంగా హారతి
అనంతపురం హెచ్చెల్సీ కాలనీలో గురువారం రాత్రి గంగా హారతి కార్యక్రమం ఘనంగా సాగింది. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని స్థానిక మంజునాథస్వామి దేవస్థానంలో నిర్వహించిన భజనల్లో పెద్ద సంఖ్యలో శివస్వాములు పాల్గొన్నారు. భక్తిగీతాలతో పరమేశ్వరుడికి నీరాజనాలర్పించారు. అనంతరం హెచ్చెల్సీ వద్ద గంగాహారతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీపాలతో కాలువ పరిసరాలు నూతన శోభ సంతరించుకున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
ఘనంగా గంగా హారతి


