
మారెమ్మ ఆలయం వద్ద సిడిమానుకు యువకుడిని కట్టి తిప్పుతున్న దృశ్యం
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద బుధవారం సాయంత్రం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దుగ్గిలమ్మ జాతర మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కోటమారెమ్మ ఆలయం వద్ద జరిగిన సిడిమాను ఉత్సవానికి రాయదుర్గం నియోజకవర్గంతో పాటు సరిహద్దు కర్ణాటకలోని గ్రామాల్లోని నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు.
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరై, ఆలయంలో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, పట్టణ కన్వీనర్ మేకల శ్రీనివాసులు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరాళ్ల శివకుమార్, వార్డు ఇన్‌చార్జ్ పైతోట రఘు, రామాంజనేయులు, గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు మురడి మురళీమోహన్‌రెడ్డి, నాయకులు బోర్‌వెల్ ఆనందరెడ్డి, పట్టణ ప్రచార కార్యదర్శి తిప్పేస్వామి, న్యాయవాది వెంకటరెడ్డి, బంగి రమేష్ తదితరులు ఉన్నారు.

ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, నాయకులు